The Desk …Tanuku : విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన నటుడు కే.వి. ప్రదీప్

The Desk …Tanuku : విద్యార్థులకు స్ఫూర్తినిచ్చిన నటుడు కే.వి. ప్రదీప్

🔴 పశ్చిమ గోదావరి జిల్లా : తణుకు : ది డెస్క్ :

రూట్స్ స్కూల్‌లో వ్యక్తిత్వ వికాసంపై ప్రేరణాత్మక ప్రసంగం

తణుకులోని రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్‌లో ప్రముఖ నటుడు, లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్ కే.వి. ప్రదీప్ విద్యార్థులతో ప్రత్యేకంగా మమేకమయ్యారు. జీవితంలో లక్ష్యాలు నిర్దేశించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, క్రమశిక్షణతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఆయన విద్యార్థులకు సూచించారు.

తన జీవిత అనుభవాలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థుల్లో సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన ప్రసంగం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుని, జీవితంపై కొత్త ఆలోచనలకు ప్రేరణనిచ్చింది.

సందర్భంగా రూట్స్ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ మాట్లాడుతూ :

తమ ఆహ్వానాన్ని మన్నించి విద్యార్థులకు విలువైన సందేశాలు అందించిన కే.వి. ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Actor K. V. Pradeep Inspires Students

Motivational Session on Personality Development at Roots School

Renowned actor, life coach, and motivational speaker K. V. Pradeep interacted with students during a special session at Roots School of Essential Faculties in Tanuku. Addressing the gathering, he encouraged students to set clear goals in life, move forward with self-confidence, and achieve great heights through discipline, dedication, and consistent hard work.

Drawing from his own life experiences, Mr. Pradeep spoke about the importance of maintaining a positive attitude, developing leadership qualities, managing time effectively, and building a strong personality. His inspiring address deeply resonated with the students and motivated them to think positively and pursue their dreams with determination.

Speaking on the occasion, Roots School Correspondent Krishna expressed gratitude to Mr. K. V. Pradeep for accepting the school’s invitation and taking the time to share his valuable insights and life lessons with the students.

Teachers and students participated enthusiastically in the programme.