🟡 పగో : భీమవరం : ది డెస్క్ :

*భీమవరం నియోజకవర్గంలో ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన వి.బి.జి రాంజీ ఉపాధి హామీ పథకాన్ని శాసనసభ్యులు అంజిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ :
యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ పథకం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించి, కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు పథకం అమలు విధానం, లబ్ధిదారులకు అందే ప్రయోజనాలను వివరించగా, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
VBG Ranjy Employment Assurance Scheme Launched to Expand Job Opportunities
Scheme inaugurated in Bhimavaram Constituency by MLA Anjibabu
With the objective of creating employment opportunities for unemployed youth in the Bhimavaram Assembly Constituency, MLA Anjibabu formally launched the VBG Ranjy Employment Assurance Scheme.
The inauguration was attended by former MP Seetharamalakshmi, TDP State Secretary Kolla Nageswara Rao, officials from the concerned departments, and leaders of the ruling coalition.
Speaking on the occasion, MLA Anjibabu said :
Providing sustainable employment to the youth is one of the government’s foremost priorities. He stated that the scheme would significantly expand employment opportunities for local residents and contribute to the economic well-being of their families. He further affirmed that the coalition government remains committed to effectively implementing welfare and developmental programmes for the benefit of the people.
During the programme, officials explained the implementation process of the scheme and the benefits that would be extended to eligible beneficiaries. Coalition leaders, party workers, public representatives, and a large number of local residents participated in the event.

