🟡 పగో జిల్లా : కాళ్ల మండలం : కాళ్ళకూరు : ది డెస్క్:
కాళ్ళకూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు మరో దాతృత్వ సహకారం లభించింది. ఆలయం చుట్టూ మాడవీధుల విస్తరణ కోసం స్థల కొనుగోలు నిమిత్తం కాళ్ళకూరు వాస్తవ్యులు కీ.శే. ముదుండి కమలమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త ముదుండి వెంకట సత్యనారాయణ రాజు కుమారుడు ముదుండి వెంకట విజయ రామరాజు, ఆయన సతీమణి సునీత దంపతులు రూ.1,01,116 విరాళాన్ని దేవస్థానానికి అందజేశారు.
ఈ విరాళాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, పాలకమండలి అధ్యక్షుడు అడ్డాల శివరామరాజు సమక్షంలో పాలకమండలి సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో స్వీకరించారు.
ఈ సందర్భంగా దాతలను అభినందించిన ఆలయ అధికారులు, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించారు.
దేవస్థాన అభివృద్ధికి భక్తులు ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని ఆలయ పాలకమండలి పేర్కొంది.
₹1,01,116 Donated for the Development of Sri Venkateswara Swamy Temple Financial support from
devotees for the expansion of Mada Streets
Another generous contribution has been made towards the ongoing development works at the Sri Venkateswara Swamy Temple in Kallakuru. As part of the temple’s initiative to expand the surrounding Mada Streets by acquiring additional land, Mr. Mudundi Venkata Vijaya Rama Raju and his wife Mrs. Sunitha, son and daughter-in-law of Mr. Mudundi Venkata Satyanarayana Raju, donated ₹1,01,116 in memory of Late Smt. Mudundi Kamalamma.
The donation was formally received in the presence of the Temple Executive Officer and Chairman of the Temple Trust Board, Mr. Addala Sivarama Raju, along with members of the Trust Board and village elders.
On the occasion, the temple authorities felicitated the donors by presenting them with the sacred Sesha Vastram and prasadam. The couple also received Vedic blessings from the temple priests.
The Temple Trust Board appreciated the generosity of devotees and stated that such contributions play a vital role in supporting the temple’s development and preserving its spiritual heritage.

