The Desk … Kalidindi : విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించాలి : ఎస్సై

The Desk … Kalidindi : విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టి సారించాలి : ఎస్సై

ఏలూరు జిల్లా : కలిదిండి : ది డెస్క్ :

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం కలిదిండి పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ .. శక్తి యాప్ ఉపయోగాలు, బాల్య (మైనర్) వివాహాల దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలపై ఆయన విద్యార్థులకు వివరించారు.

అలాగే ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని నిర్దేశించుకుని భవిష్యత్తుపై దృష్టి సారించాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువులో రాణించాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు లేదా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.