🔴 పగో: తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాడేపల్లిగూడెం పురపాలక సంఘం కౌన్సిల్ హాల్లో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక కమిషనర్ ఎం. యేసుబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా చర్యలు చేపట్టాలని, ఒక్క బిడ్డ కూడా మిస్ కాకుండా 100 శాతం కవరేజ్ సాధించాలని అధికారులకు సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని, పోలియో బూత్ల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి తాడేపల్లిగూడెంను పోలియో రహిత పట్టణంగా నిలబెట్టాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

