🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఈ నెల 24న ఏలూరులోని సర్ సీఆర్ రెడ్డి కళాశాలలో నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :
ఇప్పటివరకు ఏలూరు నియోజకవర్గంలో ఐదు జాబ్‌మేళాలు నిర్వహించి సుమారు 680 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. ఆరో విడతగా నిర్వహించనున్న ఈ జాబ్‌మేళాలో 13 కంపెనీలు పాల్గొని 950 ఉద్యోగాలను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగ యువత ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సర్ ప్రక్రియపై అపోహలు వద్దు :
ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఓటరికి ఓటు హక్కు భద్రంగా ఉంటుందని తెలిపారు.
ఓటర్లెవ్వరూ అపోహలకు గురికావద్దని, ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల్లో అనవసర ఆందోళనలు సృష్టించే ప్రచారాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Mega Job Fair in Eluru on June 24
950 Job Opportunities Available
Eluru MLA Badeti Chanti stated that the coalition government is committed to creating employment and self-employment opportunities for unemployed youth across the state. On Friday, he unveiled posters for the Job Fair scheduled to be held on June 24 at Sir C.R. Reddy College, Eluru.
Speaking on the occasion, the MLA said :
So far, five Job Fairs have been conducted in the Eluru Assembly constituency, providing employment opportunities to nearly 680 candidates. As part of the sixth edition of the initiative, 13 companies will participate in the upcoming Job Fair, offering around 950 job openings.
He urged unemployed youth to register their names in advance and make the best use of this opportunity.
No Need for Misconceptions About the SIR Process :
The MLA dismissed what he described as misinformation suggesting that certain sections of society are being treated unfairly through the Special Intensive Revision (SIR) process. He stated that the process is being conducted transparently under the supervision of the Election Commission of India, and that the voting rights of every eligible voter will remain fully protected.
He appealed to voters not to be misled by rumors or misconceptions and advised that anyone with doubts regarding the process could contact him directly for clarification. He also urged the public to stay away from campaigns that create unnecessary anxiety and confusion among voters.

