The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు

The Desk … Bhimavaram : మావుళ్లమ్మ సన్నిధిలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మావుళ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ మరియు ఆయన సతీమణి సరిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ తదితరులు దంపతులను సత్కరించి శేషవస్త్రం, జ్ఞాపిక, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.

అమ్మవారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా కంచర్ల శ్రీకాంత్ దంపతులు ప్రార్థించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Government Whip Kancharla Srikanth and Wife Offer Prayers at Mavullamma Temple

Kancharla Srikanth, Graduates’ MLC representing the Prakasam, Nellore, and Chittoor districts and Government Whip, along with his wife Saritha, visited the renowned Mavullamma Ammavari Temple in the district and offered special prayers.

On the occasion, the temple priests conducted special rituals amidst the chanting of Vedic hymns and bestowed their blessings upon the couple.

Later, Devasthanam Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh, Temple Chairman Bondada Naga Bhushanam, Trustee Ramayanam Srinivas, and other temple dignitaries felicitated the couple and presented them with a ceremonial shawl, a memento, and the sacred prasadam of Goddess Mavullamma.

According to temple authorities, the couple prayed for the well-being, peace, and prosperity of the people of the state and for the state’s continued progress and development in all sectors through the blessings of the Goddess.

Temple officials, staff members, devotees, and other dignitaries participated in the programme.