The Desk… Bhimavaram : “యోగాంధ్ర కార్యక్రమం”

The Desk… Bhimavaram : “యోగాంధ్ర కార్యక్రమం”

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

ఈరోజు స్థానిక బ్యాంక్ కాలనీలోని కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు.. భీమవరం పురపాలక సంఘ మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ :

యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ప్రతి వ్యక్తిలో క్రమశిక్షణ, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా యోగా ఇన్‌స్ట్రక్టర్లు, కృష్ణదేవరాయ పతంజలి యోగా మిత్ర మండలి సభ్యులు, శరామాయణం రమేష్ బాబు మరియు ఇతర యోగా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరై యోగాసనాలు, ప్రాణాయామాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భీమవరం పురపాలక సంఘ అసిస్టెంట్ కమిషనర్ ఎ. రాంబాబు, ఆయుష్ డాక్టర్, DHTO అప్పారావు, విజ్ఞాన వేదికకు చెందిన రంగసాయి, కృష్ణదేవరాయ కళ్యాణ మండపం అధ్యక్షులు కాగిత మహంకాళరావు, ప్రధాన కార్యదర్శి మెంటే పార్ధసారథి, ఎమ్మెల్సీ గోపీమూర్తి, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేళం దుర్గాప్రసాద్, కార్యదర్శి పాండురంగారావు, జిల్లా వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ వడపుగోపి, బ్యాంక్ కాలనీ–మైత్రి కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ కమల రాము, కార్యదర్శి అడ్డగళ్ల ప్రభాకరరావు పాల్గొన్నారు.