The Desk …Eluru : ‎కార్యకర్త కుటుంబానికి ఎంపీ భరోసా

The Desk …Eluru : ‎కార్యకర్త కుటుంబానికి ఎంపీ భరోసా

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, చిన్నకామనపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ముదినేపల్లి మండల ప్రధాన కార్యదర్శి నున్న సాయి కుమార్ ఇల్లు మంగళవారం అగ్నిప్రమాదానికి గురికాగా…విషయం తెలుసుకున్న ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, ఫోన్ ద్వారా పరామర్శించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.

ఎంపీ ఆదేశాల మేరకు అగ్నిప్రమాదానికి గురైన నున్న సాయి కుమార్ నివాసాన్ని సందర్శించిన పార్టీ నేత మన్నే అశోక్ గజపతి రాజు ₹20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబానికి తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియజేసి, ధైర్యంగా ఈ కష్టకాలాన్ని ఎదుర్కోవాలని ఆకాంక్షించారు.