The Desk … Tadepalligudem : పారిశుధ్య సిబ్బందికి ఉచిత కంటి పరీక్ష శిబిరం

The Desk … Tadepalligudem : పారిశుధ్య సిబ్బందికి ఉచిత కంటి పరీక్ష శిబిరం

🔴 పగో జిల్లా తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో..

కమిషనర్ యేసుబాబు ఆదేశాల మేరకు..

పురపాలక కార్యాలయంలో పారిశుధ్య సిబ్బంది/పబ్లిక్ హెల్త్ వర్కర్ల కోసం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని డా. అగర్వాల్ కంటి ఆసుపత్రి వైద్య బృందం నిర్వహించారు. కార్యక్రమానికి కమిషనర్ యేసుబాబు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, కంటి చూపు పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత మందులు, కళ్లద్దాలు అందించారు.

సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :

రోడ్లపై, చెత్త సేకరణలో విధులు నిర్వర్తించే పారిశుధ్య సిబ్బంది కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, వారి సంక్షేమం కోసం ఇలాంటి వైద్య శిబిరాలను భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని తెలిపారు.

Free Eye Screening Camp for Sanitation Workers

Organized by Tadepalligudem Municipality

Held Under the Directions of Commissioner Yesubabu

A free eye screening camp was organized at the Municipal Office for sanitation workers and public health workers. The camp was conducted by a medical team from Dr. Agarwal’s Eye Hospital. Municipal Commissioner Yesubabu attended the program and formally inaugurated the camp.

During the camp, participants were educated about eye health and common vision-related issues. Eye examinations were conducted, and those requiring assistance were provided with free medicines and spectacles.

Speaking on the occasion, Commissioner Yesubabu said :

Sanitation workers, who perform their duties on roads and are involved in waste collection activities, require special attention to their eye health due to the nature of their work. He stated that the municipality is committed to the welfare of its sanitation workforce and will continue to organize such medical camps in the future to support their health and well-being.