The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ వద్ద “ఆపరేషన్ క్లీన్ స్వీప్”

The Desk … Tadepalligudem : తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్ వద్ద “ఆపరేషన్ క్లీన్ స్వీప్”

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

పారిశుధ్య పనుల్లో స్వయంగా పాల్గొన్న కమిషనర్ యేసుబాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని ఏరియా హాస్పిటల్ వద్ద మున్సిపల్ కమిషనర్ M. యేసుబాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కమిషనర్ శ్రమదానం:

ఏరియా హాస్పిటల్ వద్ద రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను కమిషనర్ యేసుబాబు స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. అధికారులు, సిబ్బందితో కలిసి శ్రమదానం చేశారు.

మురుగు కాల్వల శుభ్రత :

హాస్పిటల్ రోడ్డు పక్కన ఉన్న మురుగు కాల్వలను శుభ్రం చేయించి, పూడిక తీయించారు. దోమలు వ్యాపించకుండా బ్లీచింగ్, మలేరియా ఆయిల్ స్ప్రే చేయించారు.

సందర్భంగా కమిషనర్ M. యేసుబాబు మాట్లాడుతూ :

“రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజారోగ్యం బాగుంటుందని, అధికారులు చెప్పడమే కాకుండా చేసి చూపించాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, స్థానిక రాజకీయ నాయకులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

As part of the state government’s flagship “Operation Clean Sweep,” Tadepalligudem Municipal Commissioner M. Yesubabu led a large-scale cleanliness drive today at the Area Hospital, personally taking part in the
manual cleaning operations.

Commissioner Yesubabu was seen clearing litter strewn along both sides of the hospital road, joining municipal staff and sanitation workers in hands-on labor. Teams cleaned and desilted drainage channels adjacent to the road, removed accumulated sludge, and applied bleaching agents and malaria oil spray to curb mosquito breeding.

Addressing participants, Yesubabu said the municipality is implementing Operation Clean Sweep with strict discipline and urged residents to keep their surroundings clean, stressing that public health improves only when public spaces are maintained. He warned that stringent action will be taken against those who litter in public areas.

The drive saw enthusiastic participation from municipal and secretariat staff, sanitation workers, local political leaders and representatives of several volunteer organizations, underscoring a collective commitment to community hygiene and disease prevention.