The Desk…Tanuku : రూట్స్ స్కూల్ – రూటే సపరేట్…పది ఫలితాలలో.. మరోసారి తణుకు టౌన్ ఫస్ట్

The Desk…Tanuku : రూట్స్ స్కూల్ – రూటే సపరేట్…పది ఫలితాలలో.. మరోసారి తణుకు టౌన్ ఫస్ట్

🔴 పగోజిల్లా : తణుకు : ది డెస్క్ :

పి.బాల సత్య హరిణి 596/600

హరిణిని అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి

ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో స్థానిక రూట్స్ స్కూల్ విద్యార్థులు వరుసగా రెండవసారి తణుకు టౌన్ ఫస్ట్ గా నిలిచినట్లు స్కూలు ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థిని హరిణిని అభినందించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి :

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో తణుకు టౌన్ ఫస్ట్ సాధించిన రూట్స్ స్కూల్ ఆఫ్ ఎసెన్షియల్ ఫ్యాకల్టీస్ విద్యార్థిని పి.బాల సత్య హరిణి 596/600 ను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం తన కార్యాలయంలో ఒక ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి శాలువా, మెమెంటో మరియు పుష్ప గుచ్ఛలతో అభినందించారు.

సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ :

రూట్స్ స్కూల్ విద్యార్థిని పి.బాలసత్యహరిణికి టౌన్ ఫస్ట్ రావడం గర్వకారణమని, ఉన్నత స్థాయికి చేరాలని, విద్యార్థుల కృషి, పట్టుదల, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఫలితంగానే ఈ ఘన విజయం సాధ్యమైందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ ఎల్.కె.త్రిపాఠి, డైరెక్టర్స్ బి.విద్యాకాంత్, సుధాకర్ వర్మ, కూటమి నాయకులు మరియు తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Roots School student P. Bala Satya Harini secured town-first in the recent Class 10 results with an impressive 596 out of 600, marking the second consecutive year a Roots School pupil has topped Tanuku town. The school’s principal, L.K. Tripathi, announced the achievement and lauded the student’s dedication and the faculty’s guidance.

On Thursday, Tanuku MLA Arimilli Radhakrishna hosted a special felicitation at his office to honour Harini. He presented a shawl, memento and bouquet, praising her disciplined approach and urging her to aim for higher goals. The MLA also congratulated the school management, teachers and parents for their collective role in nurturing excellence.

The ceremony was attended by Principal Tripathi, directors B. Vidyakant and Sudhakar Varma, local leaders, parents and town dignitaries. School officials said the consistent top performance reflects sustained student effort and strong mentorship, and expressed confidence in more successes from their students in future examinations.