The Desk … Eluru : చిన్నపిల్లలకు రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానం

The Desk … Eluru : చిన్నపిల్లలకు రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానం

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం
➖డాక్టర్ అశోక్ కుమార్
(సీనియర్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, హెమటో ఆంకాలజిస్ట్)

చిన్నపిల్లల్లో కనిపించే థలసేమియా, సికిల్ సెల్ అనీమియా వంటి రక్త సంబంధిత వ్యాధులకు ఆధునిక వైద్య విధానమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ యూనిట్ సీనియర్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు, హెమటో ఆంకాలజిస్ట్ డా. అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం హోటల్ గ్రాండ్ ఆర్యాలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ :

గత కొన్ని సంవత్సరాలుగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ రంగంలో విశేష పురోగతి సాధించామని, ఇప్పటివరకు 450కు పైగా విజయవంతమైన బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్లు నిర్వహించమని, సికిల్ సెల్ & థలసేమియా, వంటి వ్యాధులు పిల్లల ఎదుగుదలకు తీవ్ర ప్రభావం చూపుతాయని, అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే పిల్లలు సాధారణ జీవితాన్ని గడపగలరని, ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ మరింత సురక్షితంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిందని, కుటుంబ సభ్యుల్లో సరిపోయే డోనర్ లభిస్తే చికిత్స విజయవంతం అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు.

ప్రజలకు అందుబాటులో వైద్యులు :

అలాగే యశోద హాస్పిటల్స్‌లో లభ్యమయ్యే అధునాతన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం ఏలూరులో, అలాగే రెండవ బుధవారం కాకినాడ మరియు రాజమండ్రిలో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.

వ్యాధుల పట్ల అవగాహన కలిగివుండాలి :

రక్తహీనత, తరచూ జ్వరం, బలహీనత వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఇటువంటి వ్యాధుల పట్ల అవగాహన కలిగివుండాలన్నారు.

ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాల వీరభద్రం, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పి. ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

YASHODA HOSPITALS OFFERS HOPE FOR CHILDREN WITH BLOOD DISORDERS THROUGH BONE MARROW TRANSPLANTS

Modern bone marrow transplantation can provide a permanent cure for childhood blood disorders such as thalassemia and sickle cell anaemia, said Dr. Ashok Kumar, senior bone marrow transplant specialist and hemato-oncologist at Yashoda Hospitals, Somajiguda. Speaking to reporters at a media meet held Saturday at Hotel Grand Arya, Dr. Ashok highlighted significant progress in the field over recent years.

“Yashoda team has performed over 450 successful bone marrow transplants to date,” he said, adding that early detection and timely treatment allow affected children to lead normal lives. He noted outcomes improve markedly when a compatible donor is available among family members, and that advances in technology have made the procedure safer than before.

Dr. Ashok urged parents not to ignore symptoms such as anaemia, recurrent fever and persistent weakness, and to consult specialists promptly. He emphasised public awareness about these conditions and the importance of early diagnosis.

To increase access to advanced care, Yashoda Hospitals now offers specialised clinics on the third Saturday of every month in Eluru, and on the second Wednesday in Kakinada and Rajahmundry. The event was attended by Andhra Pradesh Marketing Manager Nallam Bal Veerabhadram, Marketing Executive P. Praveen and other hospital representatives.