🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : పెద్దవెల్లమెల్లి గ్రామం : ది డెస్క్ :
రైతుల ఫిర్యాదులకు స్పందన
రైతుల సమస్యకు పరిష్కారం ➖మురుగు కాలువ పూడికతీతకు శ్రీకారం
వరద ముంపు నివారణకు చర్యలు…రంగంలోకి దిగిన ఎంపీడీవో
పెద్దవెల్లమెల్లి గ్రామంలో చాలా కాలంగా పూడిక, చెత్త, పిచ్చి మొక్కలతో నిండిపోయి అపరిశుభ్రంగా మారిన మురుగు బోదు (కాలువ) పూడికతీత పనులను ఉంగుటూరు ఎంపీడీవో, గ్రామ ప్రత్యేక అధికారి జి.ఆర్. మనోజ్ పరిశీలించారు.
స్థానిక రైతుల ఫిర్యాదుల మేరకు సచివాలయం నుంచి ఇటుకలకుంట చెరువు వరకు ఉన్న మురుగు కాలువను శుభ్రపరిచే పనులను ప్రారంభించి పర్యవేక్షించారు. కాలువలో పూడిక పేరుకుపోవడంతో వర్షపు, మురుగునీరు ముందుకు ప్రవహించకుండా పొలాల్లోకి చేరి పంటలకు నష్టం కలుగుతోందని రైతులు తెలిపారు.
సదరు సమస్యపై పలుమార్లు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో.. ఎంపీడీవో మనోజ్, రైతుల సహకారంతో పూడికతీత పనులను చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

