🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ఏ గోకవరం : ది డెస్క్ :
అక్కుపల్లి గోకవరం పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో దీర్ఘకాలిక సమస్యగా స్థానికులను ఇబ్బంది పెడుతున్న డ్రైనేజీ సమస్యను పంచాయతీ అధికారులు తాత్కాలికంగా పరిష్కరించారు. అక్కుపల్లి గోకవరంలో బీసీ కాలనీ
నుంచి ప్రవహిస్తున్న మురికి కాలువకు కొంతమంది రైతులు మూడు చోట్ల అడ్డుకట్లు వేయటంతో మురికి నీరు ప్రవాహం నిలిచిపోయి బీసీ కాలనీలో తీవ్ర దుర్గంధము రావడంతో.. స్థానికులు కొంతమంది ఇటీవల ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పీజిఆర్ఎస్ నందు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు.
స్థానిక శాసనసభ్యులు ధర్మరాజు అక్కుపల్లి గోకవరంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనటానికి రావడంతో వారి దృష్టికి స్థానికులు ఈ డ్రైనేజీ సమస్యను ప్రస్తావించగా… స్పందించిన శాసనసభ్యులు వెంటనే పంచాయతీ అధికారులను ఏ గోకవరం ప్రత్యేక అధికారైన మండలపరిషత్ అభివృద్ధి అధికారిని వారి సమస్య పరిష్కరించమని ఆదేశించడంతో అధికారులు వెంటనే సదరు ప్రదేశంను సందర్శించి అడ్డుకట్ల తొలగించారు. దీంతో మురుగునీరు అంతా కూడా కిందకి పోవడంతో సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు.
ఈ బోధిని సర్వే చేసి కొంత వరకు CC డ్రెయిన్ నిర్మించి, పూడిక తీయించి, సదరు సమస్యని శాశ్వతంగా పరిష్కరించమని స్థానికులు అధికారులను కోరారు.

