స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర
🔴 తూగో జిల్లా : ఉండ్రాజవరం మండలం : కాల్దరి : ది డెస్క్ :

‘జలం – జీవం’ అనే భావనతో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను తొలగించి శ్రమదానం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తతో కాలువలు పూడుకుపోయి నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతుందని, దోమలు పెరిగి ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, ఈ విషయంపై అప్రమత్త కలిగి ఉండాలని… అదేవిధంగా నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలువల్లో చెత్త వేయడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు.

‘జలం ఉంటేనే జీవం ఉంటుంది’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, స్వచ్ఛ ఆంధ్ర సాధనకు, నీటి వనరుల పరిరక్షణకు ప్రజలంతా సహకరిస్తామని, భవిష్యత్ తరాలకు సుభిక్షమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయాన్ని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర తీర్చిదిద్దుతానని ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమoలో పంచాయతీ కార్యదర్శి వి శ్రీనివాసరావు, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, డ్వాక్రా మహిళలు,అంగన్వాడీ సిబ్బంది ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

