🔴 పగో జిల్లా : తణుకు టౌన్ : ది డెస్క్ :
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
నిమజ్జనంలో హద్దు దాటితే చర్యలు
డీజేలకు నో.. అశ్లీలతకు చెక్
నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి
➖టౌన్ సిఐ
వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తణుకు టౌన్ సీఐ మండపాల నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
▪️నిమజ్జన ఊరేగింపుల్లో అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించరాదు.
▪️మహిళలు, బాలికలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.
▪️డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్ల వినియోగానికి అనుమతి లేదు.
▪️ఊరేగింపుతో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
▪️మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, గొడవలు చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం నిషేధం.
▪️నిర్వాహకులు, భక్తులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
▪️నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని తణుకు టౌన్ సీఐ కోరారు.

