The Desk … Tadepalligudem : స్వచ్ఛతలో తాడేపల్లిగూడెం టాప్‌ లక్ష్యం

The Desk … Tadepalligudem : స్వచ్ఛతలో తాడేపల్లిగూడెం టాప్‌ లక్ష్యం

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

17 నుంచి ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమాలు

స్వచ్ఛతలో తాడేపల్లిగూడెం నంబర్‌వన్‌ కావాలి

స్వచ్ఛతకు సమష్టి సంకల్పం

పరిశుభ్రతే లక్ష్యం.. ప్రజల భాగస్వామ్యమే బలం

స్వచ్ఛతపై కమిషనర్‌ ఫోకస్‌

పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో తాడేపల్లిగూడెంను అగ్రస్థానంలో నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని మున్సిపల్‌ స్పెషల్ గ్రేడ్ కమిషనర్‌ ఎం.యేసుబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో అన్ని విభాగాల అధికారులతో కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 17 నుంచి ప్రతిరోజూ నిర్దేశిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ప్రతి సచివాలయ పరిధిలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, మీడియా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కమిషనర్‌ డి.భవానీబాబు, మున్సిపల్‌ ఇంజనీర్‌ వై.వెంకటరమణ, ఇతర అధికారులు, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.