🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
పట్టణ ప్రణాళికలో నిబంధనలు, భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ నిబంధనలపై టౌన్ ప్లానింగ్ సెక్రటరీలకు అవగాహన కల్పించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం టౌన్ ప్లానింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ రీజనల్ డైరెక్టర్ జి.వి. సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొని నిబంధనలు, అనుమతుల ప్రక్రియపై వివరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు, ఏడీటీపీ ఏ.ఆర్. జోష్ణ, ఏసీపీ సీతారాం, టీపీఓ విరమళ్ళు జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

