The Desk … Bhimavaram : ▪️వర్షాల కోసం వరుణ యాగం▪️

The Desk … Bhimavaram : ▪️వర్షాల కోసం వరుణ యాగం▪️

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ ఆలయంలో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు

వర్షాలు కురవాలి.. పాడిపంటలు పండాలి

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షిస్తూ భీమవరం పట్టణంలోని ప్రముఖ ఆరాధ్యదైవం మావుళ్లమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ ఆదేశాల మేరకు మూడు రోజులపాటు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు వేద మంత్రాలను పఠిస్తూ వరుణ మంత్ర జపం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమవరం శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యురాలు, భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తోట సీతామహాలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఆలయ పాలకవర్గ సభ్యులు రామాయణం శ్రీనివాసరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మి నిర్మల, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పాపోలు ఏడుకొండలుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు పాల్గొన్నారు.