🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : పూళ్ళ : ది డెస్క్ :
ప్రజలకు ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పడం మాత్రమే కాదని.. పంచాయతీ స్థాయి నుంచి ప్లాస్టిక్ ను నిషేదించాలని తెలిపారు పంచాయతీ అధికారులు. స్వచ్ఛత కోసం ప్రభుత్వం స్వచ్ఛరథం ద్వారా చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఇంటింటికీ చేరువ కావాలని సూచించారు. సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలించి కూరగాయల మొక్కలు, ఆకు కూరలు వేయాలన్నారు. రోడ్లపై ఉన్న దుమ్ము, ధూళి, చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పూళ్ల పంచాయతీ కార్యదర్శి సునంద, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి వర్కర్స్, హెల్త్, డ్వాక్రా మహిళలు, పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

