The Desk… Polavaram : గూటాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పిలుపు

The Desk… Polavaram : గూటాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పిలుపు

🔴 ఏలూరు జిల్లా : పోలవరం : ది డెస్క్ :

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

మహిళల భద్రతకు పోలీసుల అవగాహన

నేరాల కట్టడికి ప్రజల సహకారం అవసరం

పోలవరం మండలం గూటాలలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు..

డీఎస్పీ కె. జయకృష్ణ సూచనలతో..

పోలవరం ఎస్సై అప్పారావు ఆధ్వర్యంలో..

గ్రామంలో నేరాల నివారణకు ప్రజలంతా సమిష్టిగా సహకరించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై అప్పారావు సూచించారు.

ఈ సందర్భంగా సైబర్‌ నేరాల నివారణ, మహిళల భద్రత, అత్యవసర సేవలకు 112, సైబర్‌ మోసాల ఫిర్యాదులకు 1930, CEIR పోర్టల్‌ వినియోగంపై అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.