🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం అన్నవరం : ది డెస్క్ :

ఊపిరితిత్తుల సమస్యతో వివాహిత మృతి
అంత్యక్రియలకు రూ.5 వేల సాయం
ఊపిరితిత్తుల సమస్యతో ఓ వివాహిత మృతి చెందిన ఘటన ముదినేపల్లి మండలం అన్నవరం గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన పోలగాని శ్రీలక్ష్మి (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిసింది.
శ్రీలక్ష్మికి వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ కుమారుడితో కలిసి జీవిస్తున్నట్లు సమాచారం. నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
శ్రీలక్ష్మి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ముందుకొచ్చి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా రూ.5,000/- ఆర్థిక సాయం అందించారు.
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి అంత్యక్రియలకు సహకరించిన ఆమెను, డాక్టర్ మనోజ్ ను స్థానికులు అభినందించారు.

