ఏలూరు జిల్లా : ముదినేపల్లి : ది డెస్క్ :
మండలంలోని విశ్వనాధ్రిపాలెం గ్రామానికి చెందిన అనగాని మోహన్ (35) కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. భార్య, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్న మోహన్ కుటుంబం నిరుపేద కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
మోహన్ మరణవార్త తెలుసుకున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్, వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తన తండ్రి డాక్టర్ మనోజ్ ద్వారా స్పందించి, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సాయం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న భార్యాపిల్లలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వైష్ణవి ఔదార్యాన్ని పలువురు అభినందించారు.

