🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ న్యూస్ :
అప్పారావుకు ఎమ్మెల్యే నివాళులు
అప్పారావు మృతి బాధాకరం
కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన ఎమ్మెల్యే సౌమ్య
మండలంలోని కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన పొందూరి అప్పారావు పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కూటమి నాయకులతో కలిసి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అప్పారావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

