🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఏలూరు జిల్లా సర్వజనాసుపత్రిలో శుక్రవారం సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని సందర్శిం చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని, పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి జిల్లా ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో రెడ్డి అప్పలనాయుడు, చౌటుపల్లి విక్రమ్ కిషోర్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

