🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :
రూ.19 కోట్ల HAM నిధులతో రహదారుల అభివృద్ధి
ప్రజా సౌకర్యాలే లక్ష్యం
రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.19 కోట్ల హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) నిధులతో చేపడుతున్న పనుల్లో భాగంగా 13, 14, 15, 16వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

