🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

అత్యవసర సమయాల్లో ప్రజలకు సత్వర అగ్నిమాపక సేవలు అందించేందుకు అవసరమైన వనరులను మరింత బలోపేతం చేస్తున్నామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.80 లక్షలతో కొనుగోలు చేసిన నూతన వాటర్ బ్రౌజర్‌ను శుక్రవారం ఏలూరు అగ్నిమాపక కేంద్రంలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :
కూటమి ప్రభుత్వం వ్యవస్థలను బలోపేతం చేస్తూ, మంజూరైన నిధులను నిర్దేశిత పనులకే వినియోగిస్తూ పారదర్శకంగా ముందుకు సాగుతోందన్నారు. జిల్లాలో ఆరు అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయని, ఏలూరు కేంద్రంలో ఇప్పటికే రెండు వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తాజాగా మరో వాహనం అందుబాటులోకి రావడంతో అత్యవసర సేవల్లో అంతరాయాలు తగ్గి, ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించే అవకాశం ఏర్పడిందన్నారు.

