The Desk… Amaravati : ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి సర్కారు పెద్దపీట

The Desk… Amaravati : ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కూటమి సర్కారు పెద్దపీట

🟡 అమరావతి : ది డెస్క్ :

పథకాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా వర్గాలకు అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షించారు.

విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, సామాజిక భద్రత, మౌలిక వసతుల రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అవసరమైన కొత్త కార్యక్రమాలపైనా సమావేశంలో సమాలోచనలు జరిగాయి.

సమావేశంలో మంత్రులు డీఎస్‌బీవీ స్వామి, సంధ్యారాణితో పాటు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.