The Desk… Eluru : ప్రజల మధ్యే కృష్ణాష్టమి వేడుకలు

The Desk… Eluru : ప్రజల మధ్యే కృష్ణాష్టమి వేడుకలు

🟡 ఏలూరు జిల్లా : ది డెస్క్ :

కృష్ణాష్టమి వేడుకల్లో ఎంపీ పుట్టా మహేష్

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి

ప్రజల మధ్య శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. శనివారం నూజివీడు, పెదపాడు, మండవల్లి మండలాల్లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నూజివీడు మండలం పాతరావిచెర్లలో మంత్రి పార్థసారథితో కలిసి అంకమ్మ దేవరతల్లి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం పాతరావిచెర్ల, పెదపాడు మండలం ఏపూరులో జరిగిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

చిన్నప్పటి నుంచీ శ్రీకృష్ణాష్టమి అంటే తనకు ఎంతో ఇష్టమని, గ్రామస్థులతో కలిసి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు. గత రెండేళ్లుగా ఏలూరు పార్లమెంట్ ప్రజల మధ్యే జన్మాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నట్లు గుర్తుచేశారు. సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లిలో జరిగిన వేడుకల్లోనూ పాల్గొన్నారు. కార్యక్రమాల్లో ఆయా మండలాల టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.