🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దీర్ఘకాలం అధికారంలో కొనసాగితేనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” సభలో ఆయన మాట్లాడారు.

20 ఏళ్లు కూటమి పాలన ఉంటే ఏపీ నంబర్ వన్ :
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. విదేశీ పెట్టుబడులు, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వం ముందంజలో ఉందని పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధరలే లక్ష్యం :
పామాయిల్, కోకో, పొగాకు రైతులకు మెరుగైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొల్లేరు సమస్యకు ఏడాదిలోపు శాశ్వత పరిష్కారం లభిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజల వినతులు స్వీకరించిన ఎంపీ :
సభకు ముందు గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలో అభివృద్ధే ధ్యేయంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

