The Desk … Eluru : 22ఏ నుంచి 5,700 ఎకరాల తొలగింపు

The Desk … Eluru : 22ఏ నుంచి 5,700 ఎకరాల తొలగింపు

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు కలెక్టర్ కార్యాలయం : ది డెస్క్ :

5,937 మంది రైతులకు లబ్ధి

దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం

➖మంత్రి మనోహర్

ఏలూరు జిల్లాలో 5,700 ఎకరాల భూమిని 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి 5,937 మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా సమీక్ష అనంతరం లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశారు. 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్, జయమంగళ వెంకటరమణ, శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, డా.కామినేని శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.