The Desk … Eluru : యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి➖ఎమ్మెల్యే బడేటి చంటి

The Desk … Eluru : యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలు సాధించాలి➖ఎమ్మెల్యే బడేటి చంటి

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు.: ది డెస్క్ :

జాబ్ మేళాలో 106 మందికి ఉద్యోగాలు

ఏలూరు నగరంలోని సర్ సీఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి ప్రారంభించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :.

ఉద్యోగం చిన్నదైనా అందులో లభించే అనుభవం యువత భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. ఉద్యోగ అర్హతలకు తగిన అనుభవాన్ని సంపాదించడంతో పాటు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని యువతకు సూచించారు.

జాబ్ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 223 మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకోగా, వారిలో 106 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రతి రెండు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు.

106 Candidates Secure Jobs at Job Mela

Youth Should Make the Best Use of Opportunities and Aim for Higher Goals

➖ MLA Badeti Chanti

A Job Mela organized by the Andhra Pradesh Skill Development Corporation (APSSDC) at the Sir C.R. Reddy College Auditorium in Eluru city received an overwhelming response from unemployed youth. The event was inaugurated by Eluru MLA and District Telugu Desam Party President, Badeti Chanti.

Speaking on the occasion, MLA Chanti said :

He stated that even a small job can provide valuable experience that serves as a strong foundation for a young person’s future. He advised youth to gain the experience required for career growth and move forward with higher aspirations and long-term goals.
A total of 14 leading companies participated in the Job Mela and conducted interviews for aspiring candidates. Out of 223 unemployed youth who registered, 106 candidates were selected for various jobs, the MLA announced.

He said that the State Government, under the leadership of Chief Minister N. Chandrababu Naidu and Minister Nara Lokesh, is committed to creating employment opportunities for the youth. He explained that the Andhra Pradesh Skill Development Corporation is organizing Job Melas once every two months to help unemployed individuals secure suitable employment.

MLA Badeti Chanti expressed hope that young people would make the best use of the opportunities available to them and achieve greater financial stability and success in their careers.