The Desk …Devarapalli : దుమంతునిగూడెంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ

The Desk …Devarapalli : దుమంతునిగూడెంలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ

తూ.గో జిల్లా : దేవరపల్లి : ది డెస్క్ :

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామంలో దివంగత నాయకుడు వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు.

ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి, ఉపాధ్యక్షుడు బోడపాటి కేశవదేవరాయ అందజేసిన విగ్రహాన్ని వంగవీటి శంతన్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సువర్ణ రాజు హాజరై మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు కొమ్మనా మాణిబాబు, కైకలూరు మాజీ ఎంపీపీ రామకృష్ణ, సుధా, దాసు, పంగిడి పెద్దకాపు, సతీష్ కుమార్ తదితరులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలోని రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.