🟡 అమరావతి : ది డెస్క్ :
ప్రపంచవ్యాప్తంగా టీడీపీ బలోపేతమే లక్ష్యం
ప్రపంచ వేదికపై టీడీపీ జెండా రెపరెపలు
విశ్వవ్యాప్త టీడీపీ బలోపేతమే లక్ష్యం
ప్రవాసాంధ్రులే టీడీపీకి అంతర్జాతీయ బలం
ప్రపంచ తెలుగువారితో టీడీపీ అనుసంధానం
విదేశాల్లో టీడీపీ బలోపేతానికి కొత్త కార్యవర్గం
ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడంలో ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు, కార్యకర్తల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అమరావతిలో జరిగిన NRI గ్లోబల్ టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన నూతన కార్యవర్గ సభ్యులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ :
పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి చేరువ చేయాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు గ్లోబల్ టీడీపీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఈ ప్రగతి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో NRI టీడీపీ కీలకంగా పనిచేయాలని ఆమె పేర్కొన్నారు. పార్టీని అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని నూతన కార్యవర్గానికి పిలుపునిచ్చారు.

