🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
మున్సిపల్ కమిషనర్ ఎం. యేసుబాబు బుధవారం ఉదయం 32వ వార్డులో పర్యటించి, జరుగుతున్న పలు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.
నాణ్యత ప్రమాణాలు పాటించాలి :
ఈ సందర్భంగా వార్డులో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్లను, డ్రైనేజీ కాలువలను కమిషనర్ పరిశీలించారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, డ్రైనేజీలో మురుగు నిల్వ లేకుండా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. వర్షాకాలం లోపు డ్రైనేజీ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.

స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పరిశీలించిన కమిషనర్ :
వార్డులో నిర్మాణంలో ఉన్న నూతన స్విమ్మింగ్ పూల్ పనులను కమిషనర్ పరిశీలించారు. “బోలిశెట్టి శ్రీనివాస్” పేరుతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ :
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని కాంట్రాక్టర్‌కు, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చి, వార్డు అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించిన నిధులతో పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.
Municipal Commissioner Inspects Ward 32 Development Works in Tadepalligudem
Municipal Commissioner M. Yesubabu toured Ward 32 on Wednesday morning, scrutinizing ongoing development projects to ensure quality and timely completion.
He examined newly constructed CC roads and drainage channels, directing engineering officials to adhere strictly to quality standards. “Complete drainage works before the monsoon to prevent public inconvenience and avoid water stagnation,” he instructed.
Commissioner Yesubabu also reviewed progress on the new “Bolishetty Srinivas” Swimming Pool under construction. He urged contractors and staff to finish within the stipulated timeframe without compromising quality.
Speaking on the occasion, he emphasized that government-allocated funds are accelerating ward development. “Our goal is to provide better infrastructure facilities to the public,” he affirmed, reaffirming commitment to citizen welfare.

