🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :
మండలంలోని పలు గ్రామపంచాయతీ లలో బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచ్ ల పదవీకాలం ముగియడంతో ఇటీవల జిల్లా కలెక్టర్ చే నియమితులైన ప్రత్యేక అధికారులు ఈరోజు జరిగిన ప్రత్యేక గ్రామసభల్లో సర్పంచ్ హోదాలో పాల్గొన్నారు. ఆయా గ్రామసభల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోలకు, విగ్రహాలకి పూలదండలతో నివాళులర్పించారు.
ఉంగుటూరు మండలంలోని ఏ గోకవరం, నాచుకుంట, ఉంగుటూరు గ్రామ పంచాయతీలో MLA పత్సమట్ల ధర్మరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏ గోకవరం, నాచుకుంట, ఎల్లమెల్లి మరియు రావులపర్రు గ్రామాలలో జరిగిన గ్రామసభలకు మరియు అంబేద్కర్ జయంత్ ఉత్సవాలకు ఉంగుటూరు మండల అభివృద్ధి అధికారి జి ఆర్ మనోజ్ పాల్గొన్నారు.
అదేవిధంగా మండల రెవెన్యూ అధికారి అయిన పూర్ణచంద్ర ప్రసాద్ ఉంగుటూరు నారాయణపురం గ్రామాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతోత్సవాలలో ఉంగుటూరు మండల పరిషత్ అధ్యక్షురాలైన గంట శ్రీలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ :
అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే కాకుండా భారత దేశ ప్రజలందరికీ మేలు చేసిన గొప్ప నాయకుడని అంబేద్కర్ అందరివాడని ముఖ్యంగా మహిళలకు అనేక హక్కుల్ని కల్పించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. అనంతరం సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ఆమె చాక్లెట్లు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ముత్తయ్య, కార్యాలయపు పర్యవేక్షణ అధికారి అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

