🔴 ఏలూరు జిల్లా : నూజివీడు : ది డెస్క్ :
టార్గెట్ – 69.48 CR
ప్రస్తుతం – 54.55 CR
78.51%
నూజివీడు పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మిన. శ్రీనివాసరావు గురువారం పలు రికార్డులను, దస్తావేజు, స్టాంపు డ్యూటీ
వివరాలను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ కొమ్మిన. శ్రీనివాసరావు మాట్లాడుతూ :
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని, కార్యాలయంలో 69.48 కోట్ల రూపాయల లక్ష్యం కాగా 54.55 కోట్ల రూపాయలు సాధించినట్లు, త్వరలో లక్ష్యాలను చేరుకుంటామని, నూజివీడు పట్టణంలో ప్రస్తుతం కొనసాగుతున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద అసౌకర్యాలను గుర్తించామని, త్వరలోనే మరొక సౌకర్యవంతమైన భవనంలోనికి కార్యాలయాన్ని మార్చడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయం వద్ద కక్షిదారుల కోసం ఫ్యాన్ సౌకర్యం కల్పించామని ఉన్నతాధికారుల ఆదేశాలతో మరిన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు.
Eluru District Registrar Inspects Nuzividu Sub-Registrar Office
Eluru District Registrar Kommmin Srinivas Rao conducted a surprise inspection at the Nuzividu Sub-Registrar Office today, scrutinizing records, documents, and stamp duty details.
Speaking on the occasion, Srinivas Rao revealed the office has achieved 54.55 crore against a 69.48 crore target (78.51% progress), urging junior assistant recruitment and assuring target achievement soon. He noted discomforts at the current facility, promising a swift shift to a more spacious building. Fans have been installed for waiting citizens, with further amenities to follow per higher officials’ directives.

