🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
యూనియన్ కార్యాలయంలో సభ్యులకు – కుటుంబ సభ్యులచే జ్ఞాపికలు అందజేత
వర్ధంతి సందర్భంగా యూనియన్ సభ్యులకు అన్నదానం
చిన్నఅప్పారావు తోట రాడ్ బెండింగ్ యూనియన్ ఆఫీసు నందు పెనుపోతుల శేషగిరి (25వ వార్డు మాజీ కౌన్సిలర్)10వ వర్ధంతి సందర్భంగా… యూనియన్ కార్యాలయంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, యూనియన్ కు సంబంధించి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా పలువురు యూనియన్ సభ్యులు మాట్లాడుతూ :
పెనుపోతుల శేషగిరి రాడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా 30 సంవత్సరాలు యూనియన్ కు సేవలందించిన తీరును.. పలువురు సభ్యులు కొనియాడారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు, యూనియన్ పట్ల ఆయనకున్న నిబద్ధత గురించి వివరిస్తూ… ఆయన కృషి, పట్టుదల, ఆయన చూపించిన మార్గాల్లో మనమందరం నడుస్తూ, ఆయన లేని లోటు తీర్చలేనిదని, యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరు సహకరించి
ముందుకు వెళదామని పలువురు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా స్వర్గీయ శేషగిరి కుటుంబ సభ్యులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
Penupothula Sesha Giri’s 10th Death Anniversary Marked in Bhimavaram
The 10th death anniversary of Penupothula Sesha Giri, former 25th ward councillor and long-time president of the Chinna Appa Rao Thota Road Bending Union, was solemnly observed at the union office. Members paid floral tributes to his portrait, reminiscing his invaluable contributions over 30 years.
Union members praised Sesha Giri’s dedication, exemplary leadership, and transformative initiatives that strengthened the organization. “His hard work, perseverance, and guidance remain unmatched; we must walk his path and collectively bolster the union,” they vowed, lamenting the irreplaceable void he left.
Sesha Giri’s family and union members attended the emotional event.

