ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ :
ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ/ఎస్టీ సోలార్ సేవల ప్రారంభోత్సవం నిర్వహించారు. అలాగే SCCT సోలరైజేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన అదనపు 100 కేవీఏ సామర్థ్యమున్న రెండు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌లు)ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి, ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో విద్యుత్ సదుపాయాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. సోలార్ సేవల ద్వారా స్థిరమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

