🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం/నిడదవోలు : ది డెస్క్ :
నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో ఉన్న నిర్బంధిత వాహనాలకు సంబంధించి ఈనెల 30 న బహిరంగ వేలం నిర్వహించనున్నామని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం, గోకవరం డిపో ల్లోని నిర్బంధిత వాహనాలకు రాజమహేంద్రవరంలోని జిల్లా రవాణాశాఖ అధికారి కార్యాలయం సీజర్ యార్డు వద్ద, మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు, నిడదవోలు డిపోల్లోని వాహనాలకు నిడదవోలు ఆర్టీసీ డిపోవద్ద ఈ బహిరంగ వేలం జరుగుతుందని తెలిపారు. టాక్స్ బకా యిలు, ఫిట్నెస్, పర్మిట్లు లేకపోవడం వంటిపలు కారణాలతో మొత్తం 38 వాహనాలు నిర్బంధించామని, వీటిలో బస్సులు, తేలిక వాహనాలు, ఆటోలు, క్యాబ్స్, కార్లు, మోటారు సైకిళ్లు ఉన్నాయని తెలిపారు.
వేలానికి రెండు రోజుల ముందు వాహనాలను పరిశీలించవచ్చని, రూ.2200 దరావత్తు చెల్లించాలని, వేలం పాడిన రోజే పూర్తి మొత్తం చెల్లించాలని, జీఎస్ట తప్పనిసరి అని, రోడ్డు యోగ్యమైన వాహనాలకు మాత్రమే రికార్డులు జారీ చేస్తామని, స్క్రాప్ వాహనాలకు రికార్డులు ఇవ్వడం కుదరదని తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ముందస్తుగా వాహనాలను పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Public Auction of Impounded Vehicles on March 30 in East Godavari district
A public auction of 38 impounded vehicles will be held on March 30, announced District Transport Officer R. Suresh on Friday.
Morning auctions at 10 am will feature vehicles from Rajamahendravaram and Gokavaram RTC depots at the Seizure Yard near the DTO office. Afternoon sessions at 2 pm will cover Kovvur and Nidadavole depots at Nidadavole RTC depot.
Impounded for unpaid taxes, expired fitness certificates, and permit violations, the lot includes buses, light vehicles, autos, cabs, cars, and motorcycles. Bidders can inspect vehicles two days prior for Rs 2,200; full payment due on auction day, plus GST. Records issued only for roadworthy vehicles; scrap ones ineligible.
“Inspect beforehand,” Suresh advised.

