The Desk … Bhimavaram : ఆస్తి పన్ను బకాయిలపై స్పెషల్ డ్రైవ్

The Desk … Bhimavaram : ఆస్తి పన్ను బకాయిలపై స్పెషల్ డ్రైవ్

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పట్టణ పరిధిలోని అస్థి పన్ను బకాయిలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ కలెక్షన్ సిబ్బందికి మొండి బకాయిల వసూళ్ల విషయములో తీసుకోవలసిన చర్యలు అనగా.. కుళాయిల నిలుపుదల, ట్రేడ్ లైసెన్స్ ల రద్దు ఇతర సర్వీసుల నిలుపుదల కొరకు చట్టప్రకారం చర్యలు తీసుకొనుటకు తగు ఆదేశాలు జారీ చేసియున్నారు.
ఈ సందర్భంగా పన్ను చెల్లింపు దారులకు ప్రభుత్వం కల్పించిన వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకొని, సకాలములో పన్నులు చెల్లించాలని ఓ ప్రకటనలో తెలిపారు.