The Desk … Amaravati : ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ➖మంత్రి ఆనం

The Desk … Amaravati : ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు ➖మంత్రి ఆనం

🔴 అమరావతి : ది డెస్క్ :

పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…:

రంజాన్ మాసం అనేది త్యాగం, సహనం, దానధర్మాలు, ఆత్మశుద్ధి వంటి ఉన్నత విలువలను మానవాళికి నేర్పించే పవిత్ర కాలమని మంత్రి తెలిపారు. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు ఆచరించి, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ సమాజంలో సహనాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే ఈ మహత్తర పండుగ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

రేపు జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం ప్రతి ఇంటిలో ఆనందం, శాంతి, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు దేశ అభివృద్ధిలో భాగస్వాములై, సమాజంలో సౌహార్ద వాతావరణాన్ని బలపరుస్తున్నారని మంత్రి కొనియాడారు.

కూటమి ప్రభుత్వం మత సామరస్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముస్లిం సోదరుల అభ్యున్నతి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. తమపై చూపుతున్న ప్రేమ, ఆదరణకు ముస్లిం సోదరులు ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉంటారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

ఈ పవిత్ర రంజాన్ పర్వదినం శాంతి, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షిస్తూ… అందరికీ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.