🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ -స్వచ్ఛ తాడేపల్లిగూడెం -స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా శానిటేషన్ వర్కర్స్ కోసం సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.

మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శానిటేషన్ వర్కర్స్కు గ్లవ్స్, షూస్, మాస్క్లు, యేప్రాన్ల వినియోగం, ఫార్మ్ ఎయిడ్, ఆరోగ్యం, ఆహారం సంబంధించిన శిక్షణ ఇప్పించడం జరిగింది.
శానిటేషన్ వర్కర్స్ ఆరోగ్యం చాలా ముఖ్యం అని వారికి పురపాలక సంఘం నుండి అందించిన గ్లవ్స్, షూస్, మాస్క్లు, యేప్రాన్ల వినియోగం తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
ఫార్మ్ ఎయిడ్ మరియు ఆరోగ్యం సంబంధించిన సమాచారం అందించడం జరిగింది,ఆహార నియమాలు మరియు ఆరోగ్య పరిరక్షణ గురించి తెలియజేయడం జరిగింది. పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘమని ప్రశంసించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పట్టణాన్ని పారిశుద్ధ్యంలో ప్రథమ స్థానంలో ఉంచాలని కోరారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, స్వచ్ఛ ఆంధ్ర జిల్లా కోఆర్డినేటర్ రాహుల్ , శానిటేషన్ ఇన్స్పెక్టర్ లు, సానిటేషన్ సెక్రటరీలు, పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.
Capacity Building Training for Sanitation Workers in Tadepalligudem
In a bid to boost performance in the Swachh Bharat-Swachh Tadepalligudem-Swachh Survekshan rankings, the Tadepalligudem Municipal Council, under Commissioner M. Yesubabu, organized a capacity-building training program for sanitation workers.
The session covered essential safety gear usage—gloves, shoes, masks, and aprons—first aid, health tips, and food hygiene. “Sanitation workers’ health is paramount; mandatory use of protective gear is non-negotiable,” emphasized Commissioner Yesubabu. He praised their invaluable services for urban development and urged them to maintain vigilance for top cleanliness rankings.
Participants included Swachh Andhra District Coordinator Rahul, sanitation inspectors, secretaries, and municipal workers.

