🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
శవాగారం వద్ద శోకసంద్రంలో ఉన్న బంధువులను పరామర్శించిన బడేటి
ఆదుకుంటా – అండగా ఉంటా.
ఏ గడియలోనైనా నా ఇంటి తలుపు తట్టండి : ➖MLA చంటి

ఏలూరు ఎఫ్‌సిఐ గోదాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బిడి కాలనీకి చెందిన బొంతు దుర్గాప్రసాద్, షేక్ అహ్మద్, చిట్టి ఆంజనేయులు భౌతిక కాయాలను టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సందర్శించారు. ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి మార్చురీ వద్ద ఉంచిన వారి మృతదేహాలకు ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఇదేసమయంలో అక్కడ గుండెలవిసేలా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ముగ్గురు కుటుంబాల సభ్యులను ఎమ్మెల్యే చంటి ఓదార్చారు.
వారి కుటుంబాల వివరాలను పూర్తిగా తెలుసుకున్నారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే బడేటి చంటి…అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా కల్పించడమే కాకుండా తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలను అందించి, వారికి ధైర్యం చెప్పారు. ఆయన వెంట టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ మరియు వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురులు పాల్గొన్నారు.
Moved by Grief: Badeti Assures Support to Victims’ Families.
Eluru MLA consoles kin at mortuary, offers immediate aid
TDP district president and Eluru MLA Badeti Chanti visited the mortuary at the government hospital here to pay respects to the bodies of three Bidi Colony residents—Bonthu Durgaprasad, Shake Ahmed, and Chitti Anjaneyulu—who died in a tragic road accident near the FCI godowns.
Visibly moved by the wailing families’ anguish, Badeti comforted them, gathered full details of their plight, and assured all possible support. He immediately handed over Rs 10,000 each to the three families as relief, instilling hope amid sorrow.
Accompanying him were TDP city secretary Reddy Nagaraju, corporator Tangirala Arun Suresh, and other party leaders.

