The Desk … Ghantasala : కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ వేమన చందన

The Desk … Ghantasala : కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ వేమన చందన

కృష్ణాజిల్లా : చిట్టూర్పు – ఘంటసాల : ది డెస్క్ :

ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐఐ వేమన చందన హెచ్చరించారు.

సోమవారం ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు కోడి పందాల శిబిరం పై దాడి చేసి పందాలు నిర్వహిస్తున్న ఇరువురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ చందన తెలిపారు. వారి వద్ద నుంచి రూ.2,200 నగదు, ఒక కోడిపుంజును స్వాధీనం, మరొక కోడిపుంజుతో కొంతమంది వ్యక్తులు పారిపోయినట్లు చెప్పారు.

ఘంటసాల మండలంలో పేకాట, కోడిపందాలు, చిత్తులాట, ఇతర అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తే సంబందిత వ్యక్తుల గురించి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ చందన ప్రజలను కోరారు.