The Desk … Eluru : ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదిన సంబరాలు

The Desk … Eluru : ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదిన సంబరాలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ :

ఏలూరు నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరు ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు మిన్నంటాయి. పేదల అభ్యున్నతే లక్ష్యంగా నిరంతరం పాటుపడుతూ చివరకు పుట్టినరోజున కూడా పేదల సంక్షేమమే పరమావధిగా భావించి రాష్ట్ర శాసన సభా సమావేశాలకు ఎమ్మెల్యే హాజరైనప్పటికీ ఆయన తరపున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి టిడిపి నాయకులు, కార్యకర్తలు, బడేటి అభిమానులు, కుటుంబ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలిచారు.

పలుచోట్ల కేక్‌ కటింగ్‌లు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. దీనిలో భాగంగా ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎమ్మెల్యే సోదరుడు, రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య, ఎమ్మెల్యే చంటి సతీమణి బడేటి మీనాలు భారీ కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు.

అనంతరం ఎమ్మెల్యే సొంత నిధులతో భారీగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌ ప్రారంభించారు. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించడంతో పాటూ పలువురికి ఉచితంగా కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.

అలాగే జనరల్‌ ఫిజిషియన్ల ఆధ్వర్యంలో అన్నిరకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మాజీ మంత్రి మరడాని రంగారావు చేతులమీదుగా ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇదేసమయంలో బిపి, షుగర్‌ టెస్టులు నిర్వహించి అవసరమైన సలహాలు, సూచనలు అందించడంతో పాటూ మందులు ఉచితంగా అందజేశారు. ఆ తర్వాత బడేటి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 22 మంది పేదలకు తోపుడు బళ్ళను, ముగ్గురికి కుట్టు మిషన్లను, ఒక వీల్‌ చైర్‌ను పంపిణీ చేశారు.

సందర్భంగా రాష్ట్ర వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ..

నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని ఆకాంక్షించే తన సోదరుడు, ఎమ్మెల్యే బడేటి చంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరైనందున ఆయన తరపున పుట్టిన రోజు పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. నిస్వార్థమైన సేవలకు తార్కాణంగా నిలవాలనే సంకల్పంతోనే తమకిచ్చిన సూచనల మేరకు అవసరార్ధులకు ఉపయుక్తమైన సేవలను అందించామన్నారు. ఇదేవిధంగా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్యే బడేటి సతీమణి మీనా మాట్లాడుతూ..

తన భర్త ఆకాంక్షకు అనుగుణంగా ఆయన పుట్టిన రోజున పేదలకు సేవలు అందించాలన్న లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ..బడేటి అంటే భరోసా అనే నానుడికి అనుగుణంగా ఎన్నో ఏళ్ళ నుండి పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నారని కొనియాడారు.

ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి మాట్లాడుతూ..డైనమిక్‌ ఎమ్మెల్యే బడేటి చంటి పుట్టినరోజును పురస్కరించుకుని పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతోనే ఈ సేవాకార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు. దీనికి అందరూ సహకారం అందించినట్లు వెల్లడించారు.

ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ…

గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో తనకు పట్టంకట్టిన ఏలూరు నియోజకవర్గ ప్రజల రుణాన్ని తీర్చుకునేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

జిల్లా పార్టీ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌ మాట్లాడుతూ…

ఎమ్మెల్యే బడేటి చంటి నాయకునిగానే కాకుండా ఒక సేవకుడిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నారని, ఇదేక్రమంలో సేవాగుణాన్ని స్ఫూర్తిగా అందిరికీ పంచుతున్నారని కొనియాడారు.

మహిళా నాయకులు తవ్వా అరుణకుమారి, కడియాల విజయలక్ష్మి మాట్లాడుతూ..పేదలకు సేవ చేయాలన్న తలంపు ఉన్న నాయకుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అని ప్రశంసించారు.

ఈకార్యక్రమంలో పార్టీ పరిశీలకులు మీరావలీ, జిల్లా టిడిపి మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ జిల్లా కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, పార్టీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, మోటేపల్లి చంద్రశేఖర్‌, కోటేశ్వరమ్మ దంపతులు, బెల్లపుకొండ కిషోర్‌, శ్రీలక్ష్మి దంపతులు, కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, చోడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు మరియు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు, బూత్ ఇన్చార్జులు, అనుబంధ సంఘాల సభ్యులు, బడేటి అభిమానులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Eluru MLA Badeti Chanti’s Birthday Celebrations Focus on Poor’s Welfare

Eluru district witnessed festive fervor as celebrations marked the birthday of Eluru MLA and TDP district president Badeti Chanti. Despite attending state assembly sessions, the MLA prioritized public service, with TDP leaders, activists, family, and fans organizing welfare programs across the town on his behalf. Cake cuttings, annadanam, and service activities created a joyful atmosphere.

At the MLA’s camp office in Powerpeta, Thursday morning saw a grand event. MLA’s brother and State Weightlifting Association president Badeti Venkataramayya, along with wife Badeti Meena, cut a massive cake amid family members, public representatives, party leaders, activists, and fans. Eda Chairman Peddiboyina Shivaprasad inaugurated a mega medical camp funded by the MLA’s personal resources.

Eluru Ashram Hospital doctors conducted extensive check-ups, emphasizing eye examinations. Free surgeries were promised where needed, and spectacles distributed to several beneficiaries. General physicians screened for various ailments, providing free medicines via former minister Maradani Ranga Rao. BP and sugar tests offered advice and drugs, ensuring comprehensive care.

Badeti Trust distributed sewing machines to three individuals, goats to 22 poor families, and a wheelchair to one person, amplifying the welfare drive.

Addressing the gathering, Venkataramayya praised his brother’s dedication to selfless service, noting future programs ahead. Meena echoed her husband’s vision of aiding the needy on his birthday. State Malala Finance Corporation director Dasari Anjaneyulu lauded Chanti as a reliable pillar for the poor over years.

AMC Chairman Mamillapalli Parthasarathi highlighted the intent to bring joy to the underprivileged’s eyes, crediting collective support. City TDP president Chode Venkataratnam commended the MLA’s record election majority and wished higher roles. District party spokesperson Poojari Niranjan called him a servant-leader inspiring service.

Women leaders Tavva Arunakumari and Kadiyal Vijayalakshmi hailed his service mindset. Participants included party incharges, media coordinator Challa Venkata Satyavardhan Rao, office secretaries, corporators, cluster leads, and coalition supporters.