The Desk … Dwarakathirumala : రహదారి భద్రత అవగాహన & హెల్మెట్ స్పెషల్ డ్రైవ్

The Desk … Dwarakathirumala : రహదారి భద్రత అవగాహన & హెల్మెట్ స్పెషల్ డ్రైవ్

🔴 ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : ఎం నాగులపల్లి : ది డెస్క్ :

జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్..

డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆదేశాలపై..

రహదారి భద్రత అవగాహన & హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన భీమడోలు సిఐ మరియు ద్వారక తిరుమల ఎస్ఐ.

భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారకతిరుమల ఎస్ఐ సుదీర్ తమ సిబ్బందితో కలిసి ఎం నాగులపల్లి గ్రామములో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ…రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా…హెల్మెట్లు ధరించనటువంటి వారిపై జరిమానాలను విధించకుండా..వాహన దారులతో 30 హెల్మెట్లను కొనుగోలు చేయించారు.

కార్యక్రమములో భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్ మాట్లాడుతూ…

హెల్మెట్ భారం కాదు నీ ప్రాణానికి రక్షణ కవచమని,నీ కోసం ఇంట్లో ఎదురుచూసే ప్రాణాలున్నాయని, హెల్మెట్ ధరించడం మర్చిపోకూడదని, తల రాతను మార్చలేం కానీ…తలకు హెల్మెట్ పెట్టి చావును తప్పించవచ్చని, స్టైల్ కోసం హెల్మెట్ వదలద్దు – నీ లైఫ్ కోసం హెల్మెట్ మరువద్దని, బైక్ రేస్ కాదు – హెల్మెట్ లేకపోతే నీజీవితం లాస్ అని, మీ తల – మీ కుటుంబానికి ఆస్తి దానిని జాగ్రత్తగా చూసుకోండని భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ లు హెచ్చరించారు.

హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు :

▪️ ప్రాణాపాయం నుండి రక్షణ రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాలలో 80% పైగా తలకు తగిలిన గాయాల వల్లే జరుగుతాయి.

▪️ హెల్మెట్ ధరించడం వల్ల మెదడుకు గాయం అయ్యే ప్రమాదం 70% నుండి 80% వరకు తగ్గుతుంది.

▪️ కంటి రక్షణ హెల్మెట్ ముందు ఉండే గ్లాస్ ప్రయాణ సమయంలో గాలి, ధూళి, పురుగులు మరియు ఇసుక రేణువులు కంట్లో పడకుండా కాపాడుతుంది. దీనివల్ల దృష్టి మళ్ల కుండా ప్రశాంతంగా వాహనం నడపవచ్చు.

▪️ వాతావరణం నుండి రక్షణ ఎండ తీవ్రత నుండి తల వేడెక్కకుండా, వర్షంలో తల తడవకుండా మరియు చలికాలంలో చెవులకు గాలి తగలకుండా హెల్మెట్ రక్షణనిస్తుంది.

▪️ ఏకాగ్రత పెరుగుదల హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బయటి అనవసర శబ్దాలు తగ్గి, డ్రైవింగ్‌పై దృష్టి కేంద్రీకరించడానికి వీలవుతుంది.

▪️ జరిమానాల నుండి విముక్తి. ట్రాఫిక్ నిబంధనలు పాటిం చడం వల్ల జరిమానా లు కట్టాల్సిన అవసరం ఉండదు. ఇది మీ ఆర్థిక పొదుపుతో పాటు బాధ్యతా యుతమైన పౌరుడిగా గుర్తింపునిస్తుంది.

Eluru Police Launch Helmet Drive to Boost Road Safety in M Nagulapalli

In a proactive move to curb road accidents, Eluru District SP Pratap Shiv Kishore and DSP Shravana Kumar directed a special awareness drive on helmet usage and road safety at M Nagulapalli village in Dwaraka Tirumala Mandal.

Bhimadolu CI Wilson and Dwaraka Tirumala SI Sudhir, along with their teams, engaged motorists in the program. Instead of fines, they facilitated the purchase of 30 helmets, emphasizing voluntary compliance with the slogan: “Wear a helmet, save your life.

“Speaking at the event, Inspector Wilson urged, “A helmet isn’t a burden—it’s armor for your life. There are loved ones waiting at home. You can’t replace a broken head, but a helmet can prevent death. Don’t ditch it for style; your life matters more than bike races. Protect your head—it’s your family’s asset.

The drive highlighted helmet benefits :

▪️Life-saving protection : Over 80% of road accident deaths stem from head injuries.

▪️Reduces brain injury risk by 70-80%.

▪️Eye shield against dust, wind, insects, and debris for clear vision.

▪️Weather guard from sun, rain, and cold.

▪️Boosts focus by muffling noise.

▪️Avoids fines and promotes responsible citizenship.

Local residents appreciated the initiative, vowing stricter adherence. Police aim to expand such drives across the district.