The Desk … Aalamuru : కాలువగట్ల ఆక్రమణలపై తగిన చర్యలు➖గారపాటి శ్రీనివాస్ చౌదరి

The Desk … Aalamuru : కాలువగట్ల ఆక్రమణలపై తగిన చర్యలు➖గారపాటి శ్రీనివాస్ చౌదరి

🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు : ది డెస్క్ :

చింతలూరులో జొన్నాడ – వెదురుమూడి కాలువకు సంబంధించిన గట్ల ఆక్రమణలు తొలగించి రైతులకు న్యాయం చేస్తామని చింతలూరు నీటిసంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి తెలిపారు. చింతలూరు గ్రామ పంచాయతీ కార్యదర్శికి వీరన్నచౌదరికి సదరు కాలువ హద్దులు, ఆక్రమణలపై ఆయన దరఖాస్తు చేయగా సర్వేయర్ అనూష, వీఆర్వో శేఖర్, సిబ్బందితో కల్సి బుధవారం సర్వే నిర్వహించారు.

ఆక్రమణలను గుర్తించామని సర్వేయర్ తెలిపారు. వాటి వివరాలను పై అధికారులకు తెలియజేస్తామన్నారు. నీటిపారుదల శాఖ ఆస్తులను ఆక్రమించుకున్నవారికి శాఖ సిబ్బంది ద్వారా నోటీసులు పంపిస్తామని, వారి స్పందనను అనుసరించి ఆ పై చర్యలు తీసుకుంటామని నీటిపారుదల సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి మీడియాకు తెలిపారు.