The Desk … Gudivada : రితిక ఫౌండేషన్ బెస్ట్ సోషల్ వర్క్ 2026 అవార్డు కార్యక్రమం

The Desk … Gudivada : రితిక ఫౌండేషన్ బెస్ట్ సోషల్ వర్క్ 2026 అవార్డు కార్యక్రమం

🔴 కృష్ణాజిల్లా : గుడివాడ : ది డెస్క్ :

రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడివాడలోని ఎ.పి.ఎన్.జి.ఓస్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో “బెస్ట్ సోషల్ వర్క్ 2026 అవార్డులు.. సమాజ సేవలో చూపుతున్న నిబద్ధత, ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి పలువురుకు నంది అవార్డులను మరియు బెస్ట్ సోషల్ వర్క్ అవార్డులను ఇచ్చి సాలువాతో సత్కరించి ప్రశంసా పత్రాలు, మెమొంటోలను అందించారు.

సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ..

రితిక ఫౌండేషన్ సేవలు అద్భుతమైనవని, నిస్వార్ధంగా వారు చేస్తున్న అనాధ పిల్లల పట్ల సేవలను కొనియాడారు. అంతేకాకుండా సమాజసేవ మరియు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి వారికి కూడా అవార్డులు ప్రధానం చేయడం పట్ల స్థానికులు, గ్రామస్తులు హర్షించారు.

అదేవిధంగా డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవి పేదలకు చేస్తున్న నిస్వార్ధ సేవలను కొనియాడుతూ… రాజకీయ నాయకులు మాటలు మాట్లాడతారు కానీ చేతల్లో పనులు చేయరని, డాక్టర్ మనోజ్ అయితే మాటలు ఉండవు చేతలే ఉంటాయని, వైష్ణవి ఐతే బాల్యమునుండే ఉగ్గుపాలతో సేవను అలవర్చుకొని తండ్రివలే వైద్య విద్యనభ్యసిస్తూ రాబోయే రోజుల్లో సేవకు అంకితమవ్వాలననే వారి తపనను పలువురు ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్ లను కూడా పలువురు అభినందించి, అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరు క్యూఆర్ కోడ్ ద్వారా 116/- రూపాయలు సాయంచెద్దామని, కార్యక్రమంలో పాల్గొన్న పలువురు అమరావతి నిర్మాణంలో మేము కూడా పాలిభాగస్తులవ్వాలని స్వచ్ఛందంగా స్కాన్ చేసి నగదు చెల్లించారు. వీరిని డాక్టర్ మనోజ్, వైష్ణవి హృదయపూర్వకంగా అభినందించారు.

Ritika Foundation Honours Social Servants at Gudivada Awards

The Ritika Foundation presented the “Best Social Work 2026 Awards” at the APNGOs Association Kalyana Mandapam here, recognizing selfless contributions to society, especially for orphaned children and underprivileged communities.

Several dignitaries felicitated awardees with Nandi awards, certificates, and mementos, praising the foundation’s dedication. Speakers lauded its “remarkable, selfless services,” highlighting excellence in social work and various fields.

Special acclaim went to Dr. Manoj and Ambal Vaishnavi, Amaravati Brand Ambassador. “Politicians speak but don’t act; Dr. Manoj works with his hands,” one speaker noted. Vaishnavi’s lifelong ambulance service and medical aspirations were hailed as inspirational.

Guests, including the honorees, urged support for Amaravati’s development via QR code donations of ₹116. Many scanned voluntarily, with Dr. Manoj and Vaishnavi expressing heartfelt gratitude. Locals rejoiced at the event’s impact.